: పార్టీలకతీతంగా అలయ్ బలయ్ ఆహ్వానించదగ్గదే: కేసీఆర్

రాజకీయ పార్టీలకతీతంగా అలయ్ బలయ్ నిర్వహిస్తుండటం ఆహ్వానించదగ్గదని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారం జలవిహార్ లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆయన గవర్నర్ నరసింహన్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ నిర్వహించడం సంతోషకరమన్నారు. అలయ్ బలయ్ సృష్టికర్త దత్తాత్రేయనేనన్నారు. ఈ దిశగా దత్తాత్రేయ అడుగేసిన తీరు అభినందనీయమని కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు.

More Telugu News