: ఏపీ, తెలంగాణ కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: గవర్నర్ నరసింహన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కలసి సాగితేనే అభివృద్ధి సాధ్యమని గవర్నర్ నరసింహన్ చెప్పారు. ఆదివారం నాటి అలయ్ బలయ్ సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రాంతాలు, పార్టీలకతీతంగా జరుగుతున్న అలయ్ బలయ్ కార్యక్రమాలు రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూరిత వాతావరణానికి దోహదం చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రాష్ట్రాలు కలిస్తేనే బలం ఇనుమడిస్తుందని చెప్పిన నరసింహన్, రెండు రాష్ట్రాల ప్రజలు ఐకమత్యంతో మెలగాలని ఆకాంక్షించారు.

More Telugu News