: మోడీ ఎన్నికల ప్రచారంలో శివసేన ప్రస్తావన లేదు!
ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న పార్టీలనూ ఆయన వదల్లేదు. మహారాష్ట్రలో శనివారం మూడు ర్యాలీల్లో పాల్గొన్న మోడీ, ఎక్కడ కూడా శివసేన పేరెత్తలేదు. దాదాపుగా 25 ఏళ్ల పాటు ఎన్నికల్లో కలిసే పోటీ చేసిన బీజేపీ, శివసేనలు తాజాగా సీట్ల సర్దుబాటులో తలెత్తిన విభేదాల నేపథ్యంలో దోస్తీకి స్వస్తి చెప్పాయి. మోడీ అమెరికా పర్యటనలో ఉండగా, ఇరు పార్టీల మధ్య పొత్తు తెగిపోయింది.
అయితే బీజేపీతో విడిపోయి, తాను సాధించేదేమీ లేదన్నట్లుగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యవహరించారు. అమెరికా నుంచి మోడీ తిరిగి వచ్చాక, ఆయనతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానంటూ ఉద్ధవ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోడీ, తన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కూడా శివసేన ప్రస్తావన తీసుకురాలేదని తెలుస్తోంది. అంటే, ఇరు పార్టీల మధ్య దోస్తీ పూర్తిగా తెగిపోలేదనే భావించవ్చన్నమాట.