: మరో వ్యక్తిని మింగిేసిన హైదరాబాద్ మ్యాన్ హోల్!

హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన మ్యాన్ హోల్స్, మరో వ్యక్తి ప్రాణాలను హరించాయి. ఆదివారం తెల్లవారుజామున హిమాయత్ నగర్ లోని ఆరో వీధిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రాత్రి సమయంలో డ్రైనేజీని శుభ్రం చేస్తున్న క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఈ మ్యాన్ హోల్ ను తీసి, అనంతరం దానిని మూసివేయడం మరచిపోయారు. తెల్లవారుజామున అటుగా వచ్చిన సాయి అనే వ్యక్తి సదరు మ్యాన్ హోల్ లో పడిపోయాడు. దాంతో ఊపిరి ఆడక అతడు మృత్యువాత పడ్డాడు.

More Telugu News