: నా సినిమా... నా ఇష్టం... మిమ్మల్ని చూడమని పిలిచానా?: వర్మ
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తనదైనశైలి వ్యాఖ్యలతో వివాదంలో నిలిచారు. ఆయన తాజాగా విడుదల చేసిన 'సావిత్రి' సినిమా పోస్టర్ పై వివాదం రేగింది. దీంతో ఎందుకు అభ్యంతరకరమో చెప్పాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.
'సావిత్రి' సినిమా పోస్టర్ పై మహిళా సంఘాలు, బాలలహక్కుల కమిషన్, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరం లేవనెత్తిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ, అందర్లాగే టీచర్ అంటే తనకు కూడా 'క్రష్' ఉందని, అదే విషయాన్ని సినిమాలో ధైర్యంగా చెప్పానని అన్నారు. 'సావిత్రి' సినిమాపై సరస్వతి టీచర్ అభ్యంతరం చెప్పలేదని, పైగా తనను అభినందించారని వర్మ తెలిపారు.
తన భావాలను సినిమా ద్వారా వ్యక్తం చేసే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం తనకున్నాయని ఆయన స్పష్టం చేశారు. తన సినిమా చూడటం, చూడకపోవటం ప్రేక్షకుల ఇష్టమని ఆయన పేర్కొన్నారు. తనకు న్యాయపరమైన అంశాలు తెలియవని, తానేం చెప్పదలచుకున్నానో అది ప్రెస్నోట్లోనే చెప్పానని వర్మ తెలిపారు. కాగా, వర్మకు మానసిక దౌర్భల్యమని మహిళా సంఘాలు పేర్కొన్నాయి.