: నేను ఏడ్చింది... సర్దుకుపోయింది దేశం కోసమే: సరితా దేవి

తాను పతకం తీసుకునేప్పుడు ఏడ్చింది, 'ఐబా'కు క్షమాపణలు చెప్పింది దేశం కోసమేనని బాక్సర్ సరితాదేవి తెలిపారు. ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో రజతపతక ప్రదర్శన చేసి, కాంస్య పతకం గెలుచుకున్న బాక్సర్ సరితాదేవి తన వల్ల తన బృందానికి కానీ, దేశానికి కానీ చెడ్డపేరు రాకూడదని పేర్కొన్నారు. తనకు అన్యాయం జరిగిందని తన ప్రత్యర్థి కూడా అంగీకరించిందని, ఆ బాధతోనే పతకం నిరాకరించానని ఆమె స్పష్టం చేశారు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. దీనిని మర్చిపోయి, ప్రపంచ ఛాంపియన్ షిప్ పై దృష్టి కేంద్రీకరిస్తానని ఆమె చెప్పారు.

More Telugu News