: మీరే ఛానెల్ పెట్టుకోండి... దూరదర్శన్ ఎలా వాడతారు?: ఆర్ఎస్ఎస్ పై విమర్శల వాన

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగం దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయడంపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ సంస్థల అధినేతల ప్రసంగాల కోసం వారే ఓ టీవీ ఛానెల్ పెట్టుకోవాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ పేర్కొన్నారు. ప్రజల సొమ్ముతో నడిచే ప్రభుత్వ ఛానెల్ లో మతతత్వ సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం ముమ్మాటికీ తప్పేనని ఆయన స్పష్టం చేశారు. ఈ సంప్రదాయం సరికాదని ఆయన పేర్కొన్నారు. ప్రజాధనంతో నడిచే ఛానెల్ లో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాన్ని ఎలా ప్రత్యక్ష ప్రసారం చేస్తారని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ప్రశ్నించారు. వారే కాకుండా మరింత మంది ప్రముఖులు దూరదర్శన్ చేసినది పెద్ద పొరపాటని పేర్కొన్నారు.

More Telugu News