: కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం స్వాధీనం
రాయలసీమ జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా పెచ్చుమీరి పోతోంది. తాజాగా కడప జిల్లా కలశపాడు మండలం జంగాయపల్లె వద్ద అటవీశాఖ అధికారులు, పోలీసుల తనిఖీల్లో భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. లారీలో ఆ దుంగలను తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.