: మీరే మూడ్ లో ఉన్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా?
సంతోషం, ఒత్తిడి, ఒంటరితనం, నిరాశ, బాధ... ఇలా మీరే మూడ్ లో ఉన్నారన్న విషయాన్ని నిత్యం మీ చేతిలో ఉండే వస్తువు చెప్పేస్తుంటే ఎలా ఉంటుంది? తమాషాగా వుంటుంది కదూ! త్వరలో మీ స్మార్ట్ ఫోన్ ఇలాంటి వన్నీ చెప్పేస్తుంది. యూజర్ మానసిక స్థితి, అకడమిక్ పెర్ఫార్మెన్స్, ప్రవర్తనను అంచనా వేసే 'స్టూడెంట్ లైఫ్' ఆండ్రాయిడ్ యాప్ అందుబాటులోకి వచ్చింది.
విద్యార్థుల భావోద్వేగాలను ఈ యాప్ ఇట్టే పసిగట్టేస్తుంది. సంతోషం, ఒత్తిడి, ఒంటరితనం ఇలా ఏ భావోద్వేగాన్నైనా ఈ యాప్ క్షణాల్లో పట్టేస్తుందట. ఈ యాప్ ను కేవలం విద్యార్థులే కాకుండా, ఎవరైనా వాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. తాము ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను వినియోగించుకోవచ్చని వారు స్పష్టం చేశారు. 24 గంటలూ ఈ యాప్ మనిషి మానసిక ప్రవర్తనను అంచనా వేస్తుందని వారు వివరించారు.