: కేసీఆర్ పై ఊరూరా సీీడీలు పంచనున్న బీజేపీ

తెలంగాణ విమోచన దినోత్సవం నాడు తమకు జరిగిన పరాభవంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. జాతీయ జెండాను ఎగురవేయనీయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమను అడ్డుకోవడం వారిని ఆగ్రహానికి గురిచేసింది. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న తమ డిమాండ్ ను బీజేపీ నేతలు మరింత గట్టిగా వినిపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యల సీడీలను తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా పంచాలని భావిస్తున్నారు. 2010లో కేసీఆర్ మాట్లాడుతూ, హైదరాబాదు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యల తాలూకు సీడీలను ఇప్పుడు తాము ప్రతి గ్రామంలోనూ పంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సీడీని మీడియా ప్రతినిధులకు ప్రదర్శించిన ఆయన, గతంలో చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ బదులివ్వాలని అన్నారు.

More Telugu News