: విజయవాడలో ఈనెల 27నుంచి ఏపీ దూరదర్శన్ చానల్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఓ దూరదర్శన్ చానల్ ను ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 27న విజయవాడలో ఆంధ్రప్రదేశ్ దూరదర్శన్ చానల్ ప్రారంభమవుతుందన్నారు. 100 కోట్ల భారీ బడ్జెట్ తో దీనిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఉన్న దూరదర్శన్ చానల్ ఇకపై తెలంగాణ దూరదర్శన్ చానల్ గా కొనసాగుతుందని వెంకయ్య పేర్కొన్నారు.

More Telugu News