: కన్యత్వానికి విలువకట్టిన చైనా కోర్టు

మహిళ కన్యత్వానికి భంగం కలిగించాడంటూ ఓ వ్యక్తికి చైనా కోర్టు జరిమానా విధించింది. లీ అనే వ్యక్తి అబద్ధాలతో మభ్యపెట్టి తన కన్యత్వాన్ని హరించాడంటూ చెన్ అనే యువతి దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం లీకి రూ.3 లక్షలు జరిమానాగా విధించింది. 2009లో వీరిద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు. 2013లో ఉన్నట్టుండి లీ ప్రియురాలికి దూరంగా ఉండసాగాడు. ఆమె నుంచి విడవడ్డాడు. ఈ నేపథ్యంలో, ఓ రోజు లీ ఇంటికి వెళ్ళిన చెన్ నిర్ఘాంతపోయింది. అతడు తన భార్యతో కనిపించేసరికి తాను మోసపోయిన విషయాన్ని ఆమె గ్రహించింది. వెంటనే కోర్టులో అతనిపై దావా వేసింది. పెళ్ళి చేసుకుంటానన్న లీ మాటలు నమ్మి, కన్యత్వాన్ని సమర్పించానని, అందుకు నష్టపరిహారంగా రూ.49 లక్షలు చెల్లించాలని, వైద్య ఖర్చులకు మరో రూ.15 వేలు చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే, కోర్టు చెన్ డిమాండ్ మరీ ఎక్కువగా ఉందంటూ... పరిహారంగా మూడు లక్షల రూపాయలు చెల్లించాలని లీని ఆదేశించింది. కన్యత్వపు హక్కును చట్టం పరిరక్షిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

More Telugu News