: సచివాలయాల పరిసరాల్లో రెండు నెలల పాటు పోలీస్ ఆంక్షలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 18 ఉదయం 6 గంటల వరకు అంటే సుమారు రెండు నెలలపాటు ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో ఆ ప్రాంతానికి 500 మీటర్ల దూరం వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ప్లకార్డులతో ప్రదర్శనలు చేయరాదని, ఆయుధాలతో తిరగరాదని ఆయన సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.