: నిజాంను నాయిని ప్రశంసించడంపై స్వాతంత్ర్య సమరయోధుని ఆవేదన
నిజాం నవాబును తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశంసించడంపై స్వాతంత్ర్య సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నాయిని నిజాంను ప్రశంసించడం సరికాదని అన్నారు. నాయిని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల వేటలో పడిన నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.