: మెట్రో ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కథనాలు ఉన్నాయని తెలిపింది. ఎల్ అండ్ టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. మెట్రో ప్రాజెక్టు రెండో దశపై కేంద్రంతో చర్చిస్తామని చెప్పింది.