: భారత్ చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

చైనా అధ్యక్షుడు జింగ్ జిన్ పింగ్ భారత్ చేరుకున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దిగిన ఆయనకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, గుజరాత్ ముఖ్యమంత్రి, పలువురు అధికారులు స్వాగతం పలికారు. తమ దేశ ఉన్నతాధికారుల బృందంతో వచ్చిన చైనా అధ్యక్షుడు భారత్ లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సమయంలో భారత్-చైనా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు ప్రధానాంశాలుగా జిన్ పింగ్ ఇక్కడి నేతలతో చర్చలు జరుపుతారు. ముందుగా, జిన్ పింగ్ అహ్మదాబాద్ లోని సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం ప్రధాని మోడీ ఇచ్చే విందులో పాల్గొంటారు.

More Telugu News