: ఇప్పటికైనా నేలకు దిగండి: బీజేపీకి శివసేన సూచన

మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై తన వాదనను నెగ్గించుకునేందుకు శివసేన తాజా ఉప ఎన్నికల ఫలితాలను అస్త్రంగా వాడుకుంటోంది. తద్వారా బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టేసి, అనుకున్న మేర సీట్లను చేజిక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఉప ఎన్నికల్లో పరాజయాన్ని బీజేపీకి గుర్తు చేస్తూ, ఇప్పటికైనా నేలకు దిగండని పరోక్షంగా మాటల తూటాలను పేల్చింది. ఇందుకోసం తన చేతిలోని 'సామ్నా' పత్రిక సంపాదకీయాన్ని వాడుకుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లలో ఏళ్లుగా బీజేపీకి కంచుకోటలుగా కొనసాగుతున్న స్థానాలను ఆ పార్టీ కోల్పోయిందని సేన దెప్పిపొడిచింది. ‘‘ఇందుకు కారణమెవరు?’’అంటూ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీపైనే బాణాలు సంధించింది. ‘‘ఉప ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో గుణపాఠం లాంటివి. అందరికీ ఇది వర్తిస్తుంది. ఇప్పటికైనా నేలపై నిలబడి ఆలోచించాలి. ఉప ఎన్నికల ఫలితాలతో పాఠం నేర్చకున్నవారే మహారాష్ట్రలో పాలన పగ్గాలు చేపడతారు’’ అంటూ 'సామ్నా'లో శివసేన వ్యాఖ్యానించింది.

More Telugu News