: నందిగామ విజయంపై చంద్రబాబు స్పందన
కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి తంగిరాల సౌమ్య ఘనవిజయం సాధించడం ప్రభుత్వ వంద రోజుల పాలనపై ప్రజల తీర్పుకు నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా సౌమ్యను అభినందించిన బాబు, ఆమెను గెలిపించిన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రుణమాఫీ, పింఛన్ల పెంపు, నిరంతర విద్యుత్, ధరల నియంత్రణ నిర్ణయాలకు ప్రజలు ఆమోదం తెలిపారన్న దానికి నిదర్శనమే ఈ విజయం అని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థంలేనివని, అక్కసుతో చేస్తున్నవని బాబు అన్నారు.