: జంతు వధ శాలల లాభాలు ఉగ్రవాదులకు చేరుతున్నాయి: మేనకా గాంధీ
జంతు వధ శాలలు నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులు, తాము ఆర్జిస్తున్న లాభాలను ఉగ్రవాదులకు అందజేస్తున్నారని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ ఆరోపించారు. తద్వారా జంతువులను వధిస్తున్న సదరు వ్యక్తులు, దేశ పౌరులను వధించేందుకు ఉగ్రవాదులకు ఊతమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు పరమ పవిత్రంగా పూజించే గోవుల వధకు ఒక్క ముస్లింలే కారణం కాదన్న ఆమె, ఇందులో ముస్లిమేతరులు, హిందువులు కూడా పాల్పంచుకుంటున్నారన్నారు.
ఉత్తరప్రదేశ్ లో జంతువధ శాల నిర్వహిస్తున్న ఓ వ్యక్తి, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్న ముష్కరులకు ఆర్థిక చేయూతనందిస్తున్న వైనాన్ని ఆ రాష్ట్ర పోలీసులు వెలికితీశారన్నారు. ఇలాంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.