: ఏపీలో ఉనికి కోసం మావోల పాట్లు: హోం మంత్రి

ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టులు తమ ఉనికి కోసమే నానా పాట్లు పడుతున్నారని హోం శాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. ఆదివారం ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం భారీగా తగ్గిపోయిందని చెప్పిన రాజప్ప, మావోలను రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా తీర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నట్లు వెల్లడించారు.

More Telugu News