: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవు: జేపీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి సాధ్యం కాదని... ఇచ్చే అవకాశాలు కూడా లేవని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9, ఏబీఎన్ చానళ్ల నిషేధంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మంచిది కాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెస్వోలపై కేంద్రం కఠిన వైఖరి అవలంబించాలని ఆయన సూచించారు.