: ఇక మొబైల్ వాహనాల ద్వారా ఆధార్ కార్డుల పంపిణీ
ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డుతో ముడిపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, రాష్ట్రంలో మొబైల్ వాహనాల ద్వారా ఆధార్ కార్డులు పంపిణీ చేయనున్నట్టు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. సంక్షేమ పథకాలన్నింటికి ఆధార్ తో లింకు ఉన్నందువల్ల, అందరికీ ఆధార్ కార్డులు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వివరాలు తెలిపారు. అంతేగాకుండా, రాష్ట్రంలో బోగస్ కార్డుల ఏరివేతకు సర్వే చేయిస్తున్నామని పేర్కొన్నారు.