: లాలూ కోలుకున్నారు!

ముంబయిలోని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ లో చికిత్స పొందుతున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ శనివారం నాడు డిశ్చార్జి అయ్యారు. గత కొంతకాలంగా లాలూ గుండెనొప్పితో బాధపడుతున్నారు. దీంతో, ఆగస్టు 27న ఆయనకు హార్ట్ సర్జరీ చేశారు. శస్త్రచికిత్స అనంతరం లాలూ త్వరగా కోలుకున్నారని, కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని ఏషియన్ హార్ట్ ఇన్ స్టిట్యూట్ వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ రమాకాంత్ పండా తెలిపారు.

More Telugu News