: మెదక్, నందిగామలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్... 50కి పైగా పోలింగ్ శాతం నమోదు

కృష్ణాజిల్లా నందిగామ శాసనసభ, తెలంగాణలోని మెదక్ లోక్ సభ స్థానం ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. నందిగామ పరిధిలో మధ్యాహ్నం మూడు గంటల వరకు 58 శాతం పోలింగ్, మెదక్ లోక్ సభ పరిధిలో 54 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, తొలిసారి తన స్వగ్రామం సిద్ధిపేట మండలం చింతమడక వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు, గుజరాత్ లోని వడోదర, ఉత్తరప్రదేశ్ లోని మాయిన్పురి లోక్ సభ స్థానాల్లో కూడా పోలింగ్ జరుగుతోంది. అటు యూపీ లో పదకొండు, గుజరాత్ లో తొమ్మిది, రాజస్థాన్ లో నాలుగు, పశ్చిమబెంగాల్లో రెండు, ఈశాన్య రాష్ట్రాలు ఐదు, ఛత్తీస్ గడ్ లో ఒక అసెంబ్లీ స్థానానికి కూడా పోలింగ్ ప్రశాంతగా కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియనుండగా, ఈ నెల 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

More Telugu News