: నవంబర్ 1 నుంచి తెలంగాణలో కొత్త పింఛను విధానం: మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ ఒకటవ తేదీ నుంచి కొత్త పింఛను విధానం అమల్లోకి రానున్నట్లు పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పింఛన్లను లబ్ధిదారులకు చేర్చేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు. పంచాయతీరాజ్ శాఖలో 100 రోజుల పాలనపై ఈరోజు నివేదికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కొత్త పంచాయతీరాజ్ విధానం రూపొందించి త్వరలో ప్రకటిస్తామన్నారు. ప్రతి గ్రామంలో రోడ్లు, మంచినీరు, డ్రైన్లు ఏర్పాటు చేయడమే తమ ప్రాధాన్యమని చెప్పారు. రాష్ట్రంలో సమగ్ర సర్వే ద్వారా కోటి ఆరు లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందని, 96 లక్షల కుటుంబాల వివరాలను కంప్యూటర్లో పొందుపరిచామని కేటీఆర్ వెల్లడించారు.

More Telugu News