: స్మార్ట్ సిటీలపై సదస్సు నేడే

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన స్మార్ట్ సిటీల ప్రాజెక్టుపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నేడు అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమగ్ర చర్చ జరగనుంది. స్మార్ట్ సిటీల నిర్మాణంపై రాష్ట్రాల సలహాలు, సూచనలు కోరుతూ కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు సదస్సు ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. స్మార్ట్ సిటీలపై కేంద్ర ప్రభుత్వం ఓ ముసాయిదా ప్రణాళికను సిద్ధం చేసింది.

More Telugu News