: భారత జాలర్లకు శ్రీలంక అధ్యక్షుడి హెచ్చరిక

భారత మత్స్యకారులు వినాశకర పద్ధతుల ద్వారా చేపల వేట కొనసాగిస్తే చూస్తూ ఊరుకోమని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స హెచ్చరించారు. భారీ వలలతో పెద్ద ఎత్తున వేటాడడం వల్ల సముద్రంలో ఉన్న మత్స్య సంపద హరించిపోయి, సహజ వనరులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. భారత మత్స్యకారులు అనుసరిస్తున్న పద్ధతులపై ఇండియాలో కూడా నిషేధం ఉందని అన్నారు. తాము చాలాసార్లు మత్స్యకారులను హెచ్చరించామని, అయినా అదే పధ్ధతి అవలంబిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. శ్రీలంక, భారత్ మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు.

More Telugu News