: రైల్లో పసికందు... ఆర్పీఎఫ్ పోలీసుల ఔదార్యం
అమ్మతనానికే ఆమె మచ్చ తెచ్చింది. ఆ కన్నపేగు ఎలా ఒప్పుకుందో కానీ పసికందును రైల్లో వదిలేసి వెళ్లింది. ముద్దులొలికే పసికందును హైదరాబాదు నాంపల్లి పోలీసులు కనుగొన్నారు. రైలులో దొరికిన రోజుల పసికందును నాంపల్లి ఆర్పీఎఫ్ పోలీసులు రక్షించారు. పసికందును ఎవరు వదిలారన్న విషయం తేల్చేందుకు సీసీ పుటేజీ పరిశీలిస్తామని తెలిపారు. పసికందును శిశుసంక్షేమ కేంద్రానికి తరలించారు. ఆర్పీఎఫ్ సిబ్బంది బేబీ తల్లిదండ్రులెవరనే విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు.