: వరంగల్ సభలో కేసీఆర్ నాపై చేసిన వ్యాఖ్యలు సరైనవే: డిప్యూటీ సీఎం రాజయ్య

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజయ్యను ఉద్దేశించి వరంగల్ సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలపై ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ విషయంలో, నష్ట నివారణ చర్యలకు టీఆర్ఎస్ నడుం బిగించింది. ఈ క్రమంలో... కాళోజీ శతజయంతి సభలో కేసీఆర్ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరైనవేనని రాజయ్య కేసీఆర్ ను వెనకేసుకొచ్చారు. తాము చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే కేసీఆర్ సరిదిద్దుతున్నారని ఆయన వివరణ ఇచ్చారు. మంద కృష్ణను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు ఈ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.

More Telugu News