: యూకే ముక్కలవడాన్ని భరించలేను... విడగొట్టకండి: బ్రిటన్ ప్రధాని

యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఉండాలని స్కాట్లండ్ లోని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 18న స్కాట్లండ్ లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగనుంది. ఈ నేపథ్యంలో, యూకే ముక్కలవడాన్ని తాను భరించలేనని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న హుటాహుటిన స్కాట్లండ్ చేరుకున్న ఆయన... అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. "307 ఏళ్లుగా మనమందరం ఒకటిగా కలసి ఉన్నాం. ఈ క్రమంలో ఎంతో అనుబంధాన్ని పెంచుకున్నాం. ఈ అనుబంధాన్ని దయచేసి విడగొట్టకండి. నా పార్టీకన్నా నాకు నా దేశమే ముఖ్యం. నా దేశాన్ని నేను అమితంగా ప్రేమిస్తాను. మనమంతా కలసి నిర్మించుకున్న యూకే విడిపోవడం నేను భరించలేను. దయచేసి యూకేను విడగొట్టకండి" అంటూ స్కాట్లండ్ ప్రజలను కేమరూన్ అభ్యర్థించారు.

More Telugu News