: ఆ 25 లక్షలు వ్యాపారివి... ఇది సినీ ఫక్కీ ఘటన!

పాత సినిమాల్లో దొంగలు దారి కాచి దోచుకుంటుంటారు. వారిని హీరో వెంబడిస్తాడు. అతడ్ని తప్పించే క్రమంలో దొంగలు డబ్బును రోడ్డు పక్కన విసిరేసి పారిపోతూ పోలీసులకు పట్టుబడతారు. అచ్చం ఇలాంటి సినీ ఫక్కీ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటుచేసుకుంది. ఓ వ్యాపారి బ్యాంకు నుంచి 25 లక్షల రూపాయలు డ్రా చేసి తీసుకెళ్తుండగా దుండగులు నగదు అపహరించారు. దానిని గమనించిన వ్యాపారి వారిని వెంబడించాడు. దీంతో దిక్కుతోచని దుండగులు కార్లోంచి డబ్బును రోడ్డు మీద విసిరేసి పారిపోయారు. వీరిని పల్లంకుర్రు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరిని తమిళనాడుకు చెందిన దోపిడీ ముఠాగా గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వ్యాపారి చూపిన తెగువను పలువురు అభినందిస్తున్నారు.

More Telugu News