: కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ: నాగం

కేసీఆర్ అంటే ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ అని బీజేపీ నేత నాగం జనార్థనరెడ్డి తెలిపారు. మెదక్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవం అంటూ మాట్లాడుతున్న కేసీఆర్ కు ఆందోళన చేస్తున్న జర్నలిస్టుల్లో తెలంగాణ మహిళలు కనపడలేదా? అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను హరించిన వారెవరూ మంచి అనుభవాలను మూటగట్టుకోలేదని ఆయన సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియాను నిర్బంధించడం దేనికి సంకేతమని ఆయన నిలదీశారు. కేసీఆర్ తీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. కేసీఆర్ నిర్ణయంతో మీడియా మహిళా ప్రతినిధులు ఆందోళన చేస్తే, వారిని తాళ్లతో లాగి పడేసి, రోడ్డుపై ఈడ్చి అరెస్టు చేయడం ఏంటని ఆయన మండిపడ్డారు. వరంగల్ లో ప్రభుత్వ తీరును ఎండగడితే లాఠీలతో కొట్టిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తీరును ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

More Telugu News