: నాగార్జున సాగర్ కు జలకళ
నాగార్జున సాగర్ జలాశయం నీటితో కళకళలాడుతోంది. ఎగువ నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో సాగర్ నిండు కుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 581 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 1.85 లక్షల క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 50 వేల క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు భారీగా వస్తుండటంతో సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.