: పాక్ లో రెచ్చిపోయిన తాలిబన్లు... నౌకా నిర్మాణ కేంద్రంపై దాడి

పాక్ ప్రభుత్వానికి, సైన్యానికి సవాలు విసురుతున్న తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా ఆ దేశ నౌకా నిర్మాణ కేంద్రాన్నే లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. ఈ ఘటనలో ఇద్దరు తాలిబన్లు మరణించగా... ఒక అధికారి కూడా మృతి చెందారు. ఈ ఘటన శనివారమే జరిగినప్పటికీ.. భద్రతా కారణాల రీత్యా విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. దాడికి పాల్పడ్డ తాలిబన్లలో ఓ మాజీ పోలీస్ అధికారి కుమారుడైన ఒవైస్ జఖ్రానీ కూడా ఉన్నాడు. కొద్ది నెలల క్రితమే ఇతగాడు ఉద్యోగానికి గుడ్ బై చెప్పి... తాలిబన్లతో చేతులు కలిపాడు. ఈ దాడుల్లో మరో ఏడుగురు నావికులకు గాయాలైనట్టు సింధ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గులాం ఖదీర్ తెలిపారు. కమెండోల కాల్పుల్లో చనిపోయిన వారిలో జఖ్రానీ కూడా ఉన్నాడు. ఈ దాడులకు తామే పాల్పడ్డామని తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. తమకు కొందరు అధికారుల సహకారం కూడా ఉందని... అందుకే తేలికగా దాడి చేయగలిగామని తెలిపింది.

More Telugu News