: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంలో ఆప్ పిిటిషన్... గడువు కోరిన కేంద్రం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఆప్ దాఖలు చేసిన పిటిషన్ ను పరిశీలించగా, ప్రత్యామ్నాయం కోసం నెల రోజుల గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. కాగా, ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీని ఆహ్వానించాలని లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి నివేదికలో సిఫారసు చేశారని కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రపతి పరిశీలనలో ఉందని చెప్పింది.