: నా కుమారుడు నిర్దోషి... చట్టం తనపని తాను చేసుకుపోతుంది: సదానంద గౌడ

తన కుమారుడు నిర్దోషని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తెలిపారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న తన కుమారుడి కేసుపై ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ వ్యవహారంపై మీడియాతో పలుమార్లు మాట్లాడానని అన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసగించారని, పెళ్లి పేరుతో తనపై అత్యాచారం చేశారని కన్నడనటి మైత్రేయి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వారెంట్ జారీ చేసినప్పటికీ ఆయన కనిపించకుండా పోయారు.

More Telugu News