: ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ లకు త్వరలో రెండో సంతానం
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్, కేట్ మిడిల్టన్ లకు త్వరలో రెండో సంతానం కలగనుంది. ప్రస్తుతం కేట్ గర్భవతిగా ఉన్నట్లు రాయల్ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో ఖరారు చేశారు. ఈ వార్తపై క్వీన్ ఎలిజబెత్ తో పాటు ఇరు కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అటు ఈ వార్త తెలుసుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కేమరూన్ రాయల్ దంపతులకు అభినందనలు చెప్పారు. ప్రిన్స్, కేట్ ల తొలి సంతానం ప్రిన్స్ జార్జ్ గతేడాది జులై 22న జన్మించిన సంగతి తెలిసిందే.