: కదిలే కారులో కీచకపర్వం

అత్యాచారాలకు గల కారణాలను విశ్లేషించిన పలు నివేదికలు నిజమవుతున్నాయి. తెలిసినవారే అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అరాచకాల ఉత్తరప్రదేశ్ లో తాజాగా అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రాణిగంజ్ వెళ్లేందుకు ఓ స్నేహితుడి సాయం కోరిన యువతి (18)కి తీరని ద్రోహం చేశాడా కామాంధుడు. సహాయం చేస్తానని చెప్పిన యువకుడు వారి వెంట మరో ముగ్గురిని తీసుకెళ్లాడు. కదిలే కారులో నలుగురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం ముగిసిన తరువాత యువతిని రోడ్డుపైకి తోసేసి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇల్లు చేరిన బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం వివరించింది. దీంతో బాధితురాలి సోదరుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు కామాంధులను అరెస్టు చేశారు.

More Telugu News