: పాక్ సైన్యానికి స్వీట్లు పంచిన బీఎస్ఎఫ్ జవాన్లు
దేశరక్షణలో ప్రాణాలు ఫణంగా పెట్టే సైనికులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్లు స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని వాఘా సరిహద్దు, జాయింట్ చెక్ పోస్టు వద్ద పాకిస్థాన్ సైన్యానికి మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. బీఎస్ఎఫ్ ఇన్స్ పెక్టర్ జనరల్ అశోక్ కుమార్, డీఐజీ ఎంఎఫ్ ఫారూఖీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.