: పాక్ స్వాతంత్ర్య వేడుకల ప్రసంగంలో కాశ్మీర్ అంశంపై షరీఫ్ స్పందన

కాశ్మీర్ విషయంలో భారత్, పాకిస్థాన్ పరస్పరం స్పందిస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై మాట్లాడారు. ఈ మేరకు ఇస్లామాబాదులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్ లో షరీఫ్ ప్రసంగిస్తూ, కాశ్మీర్ సమస్యే ఉద్రిక్తతకు ప్రధాన కారణమన్నారు. భారత్ తో తాము పటిష్ఠమైన ద్వైపాక్షిక సంబంధాల కోసం శాంతియుతమైన మార్గాలను అన్వేషిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల టెన్షన్ ను తగ్గించుకోవచ్చన్నారు. ఈ క్రమంలో తమ సంబంధాలు ప్రోత్సహించుకునేందుకు పాక్, భారత్ కొత్త మార్గాలను కనుగొనాలని సూచించారు.

More Telugu News