: ఏపీ అసెంబ్లీకి మార్షల్స్ గా ఏపీ పోలీసులే ఉంటారు: స్పీకర్

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాద్ తెలిపారు. హైదరాబాదులో డీజీపీ జేవీ రాముడుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన పోలీసులే మార్షల్స్ గా ఉంటారని అన్నారు. మిగిలిన భద్రత హైదరాబాద్ సిటీ పోలీస్ చూసుకుంటుందని ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ ఆంక్షలు, 144 సెక్షన్ విధింపు వంటి అంశాలన్నీ వారే చూసుకుంటారని కోడెల స్పష్టం చేశారు.

More Telugu News