: ప్రతి పట్టణానికి 24 గంటలు కరెంట్ ఇస్తాం: చంద్రబాబు
మున్సిపల్ ఛైర్మన్లు వినూత్నంగా ఆలోచించాలని, సమస్యల పరిష్కారానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హైదరాబాదులో మున్సిపల్ ఛైర్మన్లతో సమావేశమైన చంద్రబాబు మాట్లాడుతూ... ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధి కేంద్రంగా మారాలని అన్నారు. ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ఆయన చెప్పారు. ఇళ్ల నిర్మాణాలను పద్ధతి ప్రకారం చేపట్టాలని, పన్నుల విధానాన్ని సక్రమంగా అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రతి పట్టణానికి 24 గంటలు కరెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.