: ఆ రైలు చాలా పొడవు గురూ!
ఒక ఎక్స్ ప్రెస్ రైలులో సాధారణంగా 22 బోగీలుంటాయి. అదే గూడ్స్ రైలులో అయితే 70 నుంచి 80 వరకు వ్యాగన్లు ఉంటాయి. అయితే, ఆఫ్రికాలోని మారిటానియా దేశంలోని రైలు మార్గంలో ప్రయాణించే గూడ్స్ రైలులో 200 వ్యాగన్లు ఉంటాయి. అక్కడి జౌరేట్ ఇనుప గనుల నుంచి అట్లాంటిక్ సముద్రతీరంలోని నౌధిబు సిటీ వరకు ఈ గూడ్స్ రైలు పట్టాలపై పరుగులు తీస్తుంది. దాదాపు మూడు కిలోమీటర్ల పొడవుండే ఈ గూడ్స్ రైలును ఏకకాలంలో నాలుగు డీజిల్ ఇంజిన్లతో నడిపిస్తారు. ఇంతకు మునుపు ప్రయాణికులు కూడా ఈ గూడ్స్ రైలు పైనే ప్రయాణించేవారు. ఇటీవలనే దీనికి కొన్ని బోగీలను ఏర్పాటు చేశారు.