: సమగ్ర సర్వేపై విచారణ రేపటికి వాయిదా

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై వేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు రేపటికి (గురువారానికి) వాయిదా వేసింది. జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రేపు మళ్లీ పిటిషన్ దాఖలు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. సర్వేకు సంబంధించి మరికొన్ని సవరణలు ఉన్నాయని న్యాయవాది పేర్కొన్నారు. మరింత సమాచారంతో సవరణలతో కూడిన పిటిషన్ ను దాఖలు చేయాలని కోర్టు సూచించింది. గెజిట్ విడుదల చేయకుండా సర్వే నిర్వహించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ సునీతా లక్ష్మి పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాంకు ఖాతా, ఆదాయం పన్ను వివరాలు అడిగే అధికారం కేంద్రానికి ఉంటుందని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు.

More Telugu News