: రాజమండ్రిలో కారు సహా వ్యక్తి సజీవ దహనం
రాజమండ్రిలో నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. స్థానిక దానవాయిపేటలో కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కారు ఎవరిది? కారులో ఉన్న వ్యక్తి ఎవరు? మంటలు ఎలా చెలరేగాయి? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.