: ఆయన మెదడు ఏ సాఫ్ట్ వేర్ తో తయారైందో..!: మోడీ ఆశ్చర్యం
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనతో అరగంట మాట్లాడితే ఓ పుస్తకం చదివినట్లుంటుందని కితాబిచ్చారు. చారిత్రక సంఘటనల గురించి ప్రణబ్ తారీఖులు, సమయంతో కచ్చితంగా చెప్పేస్తారని కొనియాడారు. "ఆయన మెదడు ఏ సాఫ్ట్ వేర్ తో తయారైందో..!" అంటూ మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉత్తమ పార్లమెంటేరియన్లకు అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.