: సమగ్ర సర్వేపై కేంద్ర హోంశాఖ ఫోకస్

ఆగస్ట్19న తెలంగాణ ప్రభుత్వం నిర్వహించదలచిన సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సర్వేపై కొన్ని రోజులుగా కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో, అసలు ఈ సర్వే ఏ ఉద్దేశంతో చేస్తున్నారన్న కోణంలో కేంద్రం ఆరా తీయడం మొదలుపెట్టింది. సర్వేకు చట్టబద్ధత ఉందా? లేదా? అనే అంశాన్ని కూడా కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో, సమగ్ర కుటుంబ సర్వే వివరాలపై తమకు నివేదిక పంపించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

More Telugu News