: వివేక్ ఓబెరాయ్ ను చూసేందుకు పోటీపడ్డ శ్రీవారి భక్తులు

బాలీవుడ్ హీరో వివేక్ ఓబెరాయ్ ఈ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం వెలుపలికి వచ్చిన ఆయనను చూసేందుకు శ్రీవారి భక్తులు ఎగబడ్డారు. అంతకుముందు స్వామివారి సేవలో పాల్గొన్న వివేక్ కు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. 'రక్త చరిత్ర' సినిమాతో వివేక్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

More Telugu News