: బ్రాండెడ్ దుస్తుల్లో గుడిలో ప్రవేశించి దొరికినంత దోచుకెళ్ళారు!
వారిని చూస్తే ఎవరైనా గొప్పింటి బిడ్డలనుకోవాల్సిందే! అలా ఉంది వాళ్ళ వేషధారణ! కింది నుంచి పైదాకా బ్రాండెడ్ వస్తువులే. ప్రముఖ కంపెనీల దుస్తులు, బూట్లు వేసుకుని రాత్రివేళ ఆలయంలో ప్రవేశించి పావుగంట వ్యవధిలో ఏడున్నర లక్షల రూపాయలు దోచుకుని పరారయ్యారు. ఉదయాన్నే అక్కడి పరిస్థితి గమనించి ఆలయ వర్గాలు నిర్ఘాంతపోయాయి. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సీసీటీవీ ఫుటేజి పరిశీలించిన పోలీసులు ఆశ్చర్యపోయారు.
ఇంత ఖరీదైన దుస్తుల్లో ఉన్న వ్యక్తులు దొంగతనం చేయడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. దొంగల ఆచూకీ తెలిపిన వారికి రూ.10 వేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ లోని కోర్బా వద్ద ఉన్న సర్వమంగళ ఆలయంలో జరిగిందీ దోపిడీ ఘటన.