: భారత నెటిజన్లు అమెరికన్లను వెనక్కినెట్టడం ఖాయమంటున్న గూగుల్

భారత్ లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఈ ఏడాది చివరినాటికల్లా భారత నెటిజన్లు అమెరికాను వెనక్కినెట్టడం ఖాయమని గూగుల్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ రాజన్ ఆనందన్ అంటున్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 2018నాటికి భారత్ లో 500 మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులుంటారని ఆనందన్ అంచనా వేశారు. ప్రస్తుతం భారత్ లో 200 మిలియన్ల మందికిపైగా నెటిజన్లున్నారు. భారత్ లో ప్రతి నెల ఐదు మిలియన్ల మంది కొత్త నెటిజన్లు పుట్టుకొస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

More Telugu News